భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
ప్రత్యేక లోక్‌అదాలత్‌లో 63 కేసుల పరిష్కారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో 63 కేసులు పరిష్కారయ్యాయి. కొత్తగూడెంలో చెక్‌బౌన్స్ కేసులు 17, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 27, మొత్తం 44 కేసులు పరిష్కారమయ్యాయి. భద్రాచలంలో చెక్ బౌన్స్ కేసులు 7 బ్యాంకు పీఎల్‌సీ కేసులు 5, మొత్తం 12 కేసులు, మణుగూరులో చెక్‌బౌన్స్ కేసులు 4, దమ్మపేటలో మూడు బ్యాంక్ పీఎల్‌సీ కేసులు పరి ష్కారమైనట్లు జ్యుడీషియల్ వర్గాలు తెలిపాయి.
స్వయం ఉపాధి దరఖాస్తుల గడువు పొడిగింపు
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ ఇన్‌చార్జ్ జిల్లా అధికా రి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. స్వయం ఉపాధి పథకం కింద కుట్టుమిషన్, చిన్న బిజినెస్, ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్‌బైక్‌లకు అర్హత ఉన్నవారు tso bmms. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 95534 91432 నంబరులో సంప్రదించాలని కోరారు.
లచ్చగూడెం వాసి అవయవదానం
ఇల్లెందురూరల్: మండలంలోని లచ్చగూడెం గ్రా మానికి చెందిన రంగినేని లక్ష్మారెడ్డికి బ్రెయిన్ డెడ్ కావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు. అవయవదానం చేయాలని బతికుండగా తనతో తండ్రి చెప్పిన మాటలను గుర్తుంచుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వర్థన్‌రెడ్డి ఆస్పత్రి వైద్యాధికారులను సంప్రదించాడు. లక్ష్మారెడ్డి కాలేయం, రెండు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను ఆస్పత్రికి దానంగా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కుటుంబీకులను గ్రామస్తులు అభినందించారు.
సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): బీసీ సంక్షేమశాఖ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, అనంతరం పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. వివరాలకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్‌లో, 08742–227427, 94419 31359, నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మెడికల్ బోర్డులో 24 మంది అన్‌ఫిట్
రుద్రంపూర్: సింగరేణి ప్రధానాస్పత్రిలో ఈ నెల 17,18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డ్‌లో 24 మందిని అన్‌ఫిట్ చేశారు. మొత్తం 120 మందిని బోర్డుకు పిలవగా 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైనవారిలో ఫిట్‌ఫర్ సేమ్ జాబ్‌కు 38 మంది, అండర్ గ్రౌండ్‌కు అన్‌ఫిట్‌గా 29 మందిని గుర్తించారు. మరొకరిని హయ్యర్ రిఫరల్‌కు ఎంపిక చేశారు. కాగా, దరఖాస్తుదారుల్లో 20 శాతం మందినే అన్‌ఫిట్ చేయడంతో కార్మిక కుటుంబాలు నిరాశ చెందాయి.


