అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో కళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల కాగితాలతో పలు ఆకృతులను తయారు చేసి ప్రదర్శించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశాక జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం పి.హరిత మాట్లాడుతూ.. కాగితపు కళ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని, గణిత భావనలు అలవడుతాయని తెలిపారు. బోధకులు, ఉపాధ్యాయులు రాంమోహన్, ప్రభాకరాచార్యులు, కిషోర్, నర్సింహారావు, కట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు. –అశ్వారావుపేటరూరల్


