● బియ్యం పక్కదారి.. | - | Sakshi
Sakshi News home page

● బియ్యం పక్కదారి..

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

● బియ్యం పక్కదారి..

గోదాంలు, మిల్లుల్లో బియ్యం నిల్వలు తగ్గించడం.. ప్రజలు ఎండలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పంపిణీ మొదలైంది. అటు మొదలుకాగానే ఇటు అక్రమార్కులు రంగంలోకి దిగారు. వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టుగానే పక్కదారి పట్టించడం మొదలైంది. ముందుగా జిల్లా కేంద్రంలో మొదలైన దందా క్రమంగా అన్ని మండలాలకు విస్తరించింది. దీంతో అప్రమత్తమైన పౌర సరఫరాల శాఖ దాడులను ముమ్మరం చేసింది. ఈక్రమాన ఇప్పటి వరకు సుమారు పది మెట్రిక్‌ టన్నుల (980 క్వింటాళ్ల) బియ్యాన్ని పట్టుబడడం గమనార్హం. అయితే, పట్టుబడింది తక్కువేనని.. ఇంతకు ఆరింతల స్థాయిలో బియ్యం ఇప్పటికే సరిహద్దులు దాటిందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement