● కట్టను కోసేస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

● కట్టను కోసేస్తున్నారు..

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

● కట్టను కోసేస్తున్నారు..

సీతారామ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదీ తీరం నుంచి జిల్లా సరిహద్దు వరకు 104 కి.మీ మేరకు ట్రంక్‌ కెనాల్‌ నిర్మించారు. ఈ కాల్వ నిర్మాణ సమయంలో తవ్విన మట్టిని ఇరువైపులా పోశారు. బయటి నుంచి వచ్చే ప్రవాహం కాల్వలోకి వెళ్లకుండా ఈ మట్టి కట్టలు సహజ రక్షణ కవచాలుగా నిలుస్తాయి. కానీ అక్రమార్కులు ఈ మట్టి కట్టలపై కన్నేశారు. అశ్వాపురం మండలం మొదలు జూలూరుపాడు మండలం వరకు ఇరువైపులా అన్ని మండలాల్లో సీతారామ కెనాల్‌ మట్టిని ఇష్టారీతిగా తవ్వి తరలిస్తున్నారు. వాస్తవానికి సాగునీటి కాల్వ వెంట అవసరానికి మించి మట్టి పోగై ఉంటుంది. ఈ మట్టి కావాలనుకునే వారు ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖల అనుమతి తీసుకుంటే ఎంత మేర తీయొచ్చో నిర్ధారిస్తారు. కానీ అలాంటివేవీ జరగడం లేదు. ఫలితంగా భవిష్యత్‌లో సీతారామ ట్రంక్‌ కెనాల్‌తో పాటు చుట్టూ పంట భూముల భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

కిన్నెరసాని వాగులో ఇసుక తవ్విస్తున్న అక్రమార్కులు

Advertisement
 
Advertisement
Advertisement