లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

బూర్గంపాడు: లారీ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని పోల వరం వద్ద చోటుచేసుకుంది. పోలీసు లు కథనం మేరకు.. ఏన్కూరు మండలానికి చెందిన మాలోత్‌ వెంగళరా వు (51) కొత్తగూడెంలో నివాసం ఉంటూ భద్రాచలం ఆర్టీసీడిపోలో డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో పోలవరం వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను భద్రాచలం తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతుడి కుమారుడు బలరాం ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ దేవ్‌సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు గాయాలు

దుమ్ముగూడెం: మండలంలోని పెద్ద నల్లబెల్లిలో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ ఉప్పు మహర్షి విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యాడు. గ్రామంలోని ఓ మిల్లు దగ్గర విద్యుత్‌ సమస్య రావడంతో మంగళవారం ఆయన ఎల్‌సీ తీసుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా సరఫరా వచ్చిందని సమాచారం. దీంతో ఆయన షాక్‌కు గురై గాయపడగా 108 వాహనంలో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

కిలో గంజాయి స్వాధీనం

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద మంగళవారంఎకై ్స జ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీ ల్లో కిలో ఎండుగంజాయి పట్టుబడింది. ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ చావా శ్రీహరిరావు బృందం వాహనాలను తనిఖీచేస్తుండగా.. టీజీ28ఏ 6621 నంబర్‌గల ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు కిలో గంజాయి తరలి స్తూ పట్టుబడ్డారు. వారిని అన్నపురెడ్డిపల్లి మండలం రాజపురానికి చెందిన అరవింద్‌కుమార్‌, హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన నక్క వాసుగా గుర్తించారు. వీరు ఒడిశాలోని కలిమెల నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి, బైక్‌, రెండు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసి, నిందితులను భద్రాచ లం ఎకై ్సజ్‌ స్టేషన్‌లో అప్పగించామని, గంజాయి విలువ రూ.1.38 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ పేర్కొన్నారు. తనిఖీల్లో ఖలీల్‌ అహ్మద్‌, రమేశ్‌బాబు, వీర బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement