రఘునాథపాలెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో జయనగర్‌కాలనీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన పందుల ఫణీంద్రకుమార్ (18), రాగం లోకేశ్ (16) మంగళవారం మధ్యాహ్నం బైక్‌పై పాండురంగాపురం వెళ్లి తిరిగి వస్తున్నారు. జయనగర్‌కాలనీ బోర్డు సమీపంలో ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఘటనలో లోకేశ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, ఫణీంద్రకుమార్‌ను ఆస్పత్రికి తరలించాక మృతి చెందాడు. వీరిలో ఫణీంద్ర డిగ్రీ, లోకేశ్ ఇంటర్ చదువుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే తమ కుమారులు మృతి చెందారనే సమాచారం తెలియడంలో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, లోకేశ్ తండ్రి రామనాథం ట్రాక్టర్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు.


