రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

పాల్వంచ: పట్టణంలోని పలు రేషన్‌ దుకాణాల్లో మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీలో భాగంగా షాపులను పరిశీలించి, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పారదర్శక పంపిణీకి కావాల్సిన సలహాలు, సూచనలు చేశారు. అనంతరం రేషన్‌ డీలర్షిప్‌ ఆథరైజేషన్‌, స్టాక్‌ పొజిషన్‌, పంపిణీకి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని, లబ్ధిదారులకు బియ్యం సకాలంలో అందేలా చూసుకోవాలని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement