ముత్తంగి అలంకరణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చా రు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

పథకాలు గిరిజనుల

చెంతకు చేరాలి

ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌

భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజ నుల చెంతకు చేరేలా అధికారులు పనిచేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్‌ రాజ్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన గిరిజ నుల నుంచి దరఖాస్తుల ను స్వీకరించి మాట్లాడారు. దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరిష్కారమయ్యేవరకు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యకరమంలో అధికారులు అశోక్‌, సైదులు, రాంబా బు, వేణు,లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, ఆది నారాయణ, అనసూయ, నారాయణరావు, హేమంత్‌, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళ, బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఖమ్మంలో జరిగే అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం ముదిగొండ మండలంలో రహదారుల నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక బుధవారం ఉదయం పెనుబల్లిలో ఏర్పాటు చేసే ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి భట్టి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం వేంసూరు మండలంలో సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో కూడా సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. ఆపై దమ్మపేట మండలంలోని సోలార్‌ మోడల్‌ విలేజ్‌ గండుగలపల్లిలో 2 కేవీ సోలార్‌ రూప్‌టాప్‌ సిస్టమ్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు.

నేడు ఖమ్మం జిల్లాలో

మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌/తల్లాడ/కల్లూరు రూరల్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9–15గంటలకు కల్లూరు మండలం చెన్నూరులో రూ.250 కోట్లతో నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత 10గంటలకు తల్లాడ మండలం బాలపేటలో గ్రామపంచాయతీ కార్యాల య భవనం, తల్లాడలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌(అంబేద్కర్‌ భవనం) ను ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొంటారు. అలాగే, సాయంత్రం ఖమ్మం 59వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి, ఆతర్వాత స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం వెళ్తారు.

Advertisement
 
Advertisement
Advertisement