అశ్వారావుపేటరూరల్: ఆర్థికంగా వెనుకబడి ఉన్న గిరిజనులంతా ఆయిల్‌పామ్ తోటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మొద్దులమడ గ్రామంలో ఆయన పర్యటించారు. 26 ఏళ్ల క్రితం నిర్మించిన సాగునీటి చెరువును ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సందర్శించారు. ఆయకట్టు గిరిజన రైతులతో మాట్లాడు. దాదాపు 400 ఎకరాల్లో జామాయిల్ సాగు చేస్తున్నారని తెలుసుకుని, వాటిని తొలగించి ఆయిల్‌పామ్ తోట లను సాగు చేయాలని సూచించారు. ఇందుకోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఐటీడీఏ పీఓ రాహుల్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, బిర్రం వెంకటేశ్వరరావు, చిప్పల బాబు తదితరులు పాల్గొన్నారు.
జీపీఎస్ పాఠశాలను సందర్శించిన పీఓ
పీఓ మొద్దులమడ గ్రామంలో కొండరెడ్డి సర్పంచ్ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మండలంలోని కోయ రంగాపురం జీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్‌సీఆర్‌పీ రాజా బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు


