సూపర్‌బజార్(కొత్తగూడెం): దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్‌టీయు ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన దీక్షను సోమవారం బస్టాండ్ సెంటర్‌లో ప్రారంభించారు. జిల్లా అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బి.రవిలకు పూలదండలు వేసి నిరసన దీక్షలను ప్రారంభించారు. 51 శాతం పీఆర్‌సీ తక్షణమే ప్రకటించాలని, రిటైర్మెంట్ బకాయిలను చెల్లించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్లతో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయు నాయకులు పాల్గొన్నారు.


