బూర్గంపాడు: ఐటీసీ పీఎస్‌పీడీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి తగదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్‌రెడ్డి అన్నారు. సారపాక ఐటీసీ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు 19వ రోజుకు చేరాయి. సోమవా రం ఆయన దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు తగదని అన్నారు. వారికి న్యాయం జరిగేంతవరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పురుషోత్తం యాదవ్, బీఆర్‌టీయూజిల్లా అధ్యక్షుడు సాని కొమ్ము శంకర్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో కన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డి, సర్వేశ్వరరావు, మర్రి వెంకటరెడ్డి, కొనకంచి శ్రీనివాస్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్‌రెడ్డి


