రైతు ఇంట్లో నెమలి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రైతు ఇంట్లో నెమలి స్వాధీనం

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

ఖమ్మంరూరల్‌: ఖమ్మంరూరల్‌ మండలంలోని తీర్థాలలోని ఓ రైతు ఇంట్లో నెమలి ఉందన్న సమాచారంతో అటవీ శాఖాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతు మాలోత్‌ కిషన్‌ మొక్కజొన్న చేనులో ఇటీవల గాయాలతో పడి ఉన్న నెమలిని తీసుకొచ్చి ఇంట్లో సపర్యలు చేయడమే కాక బోనులో పెట్టి మేత వేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో కూసుమంచి డిప్యూటీ రేంజర్‌ కేవీ.రామారావు గ్రామానికి వెళ్లి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement