సీఐటీయూ అధ్యక్షుడు
మందా నర్సింహారావు
రుద్రంపూర్: సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, రూ.51వేల కోట్ల బకాయి ప్రభుత్వం చెల్లించాలని సీఐటీయూ అధ్యక్షుడు మందా నర్సింహారావు అన్నారు. సోమవారం కార్పొరేట్ పరిధిలోని సెంట్రల్ వర్క్‌షాపులో జరిగిన పిట్ సమావేశంలో మాట్లాడారు. సింగరేణి పరిరక్షణ కోసం ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సౌధ, సెక్రటరియేట్‌లను ముట్టడించనున్నట్లు తెలిపారు. ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు తీసే పనులను సింగరేణి కార్మికులతోనే చేయించా లని కోరారు. అనంతరం పలువురు కార్మికులు సీఐటీయూలో చేరగా, కండువాలు కప్పి ఆహ్వా నించారు. కార్యక్రమంలో రాష్ట కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, విజయగిరి శ్రీని వాస్, గాజుల అప్పారావు, రమేష్ పాల్గొన్నారు.
పరికరాల పేరిట రూ.60వేలు స్వాహా
ఖమ్మం అర్బన్: ఖమ్మంకు చెందిన ఓ మహిళా వైద్యురాలు సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.60 వేలు కోల్పోయింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె అవసరమైన పరికరాల కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో వెతుకుతోంది. ఈ నేపథ్యాన ఒక యాప్ ద్వారా ఆర్డర్ చేసి రూ.60వేలు చెల్లించినా పరికరాలు అందకపోవడం.. యాప్ బాధ్యులను సంప్రదించే ప్రయత్నాలు విఫలం కావడంతో మోసపోయినట్లు గుర్తించారు. ఈమేరకు బాధితురాలు ఫిబ్రవరిలోనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయగా, సోమవారం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసే సమయాన అపరిచిత వెబ్‌సైట్లు, యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
విద్యుత్ కార్మికుల
సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది. ఖమ్మం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద శిబిరాన్ని వివిధ సంఘాల నాయకులు మందపాటి సత్యనారాయణరెడ్డి, సీతారాంగోపాల్, ఆర్.సత్యనారాయణ, నాగేం ద్రకుమార్, టి.శేషగిరిరావు, వెంకటరమణా రెడ్డి, సురేష్, శ్రీనివాస్, రమేష్, నాగేశ్వరరావు, ఎం.ప్రసాద్, కోక్యానాయక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీ నర్ అన్వర్ పాషా ఆధ్వర్యాన జరుగుతున్న సమ్మెలో సురేందర్‌రెడ్డి, ఉపేందర్, రామకృష్ణ, దాసు, రామ్మోహన్, అజారుద్దీన్, నరసింహారావు, వెంకటరెడ్డి, మంగ్యానాయక్, సైదులు, నరేష్, నాగరాజు, మోబిన్, రమాదేవి, నాగలక్ష్మి, సంధ్యారాణి, నస్రీన్, రవి, భద్రు, అనంతయ్య, సురేష్, జానీ పాల్గొన్నారు.
● ఖమ్మం మామిళ్లగూడెం: న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సమ్మె శిబిరాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాకదాని రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
కామేపల్లి: మండలంలోని బర్లగూడెం శివారు పొలంలో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డోర్నకల్‌కు చెందిన ఏడుగురిలో నలుగురు పట్టుబడగా, ముగ్గురు పరారయ్యారని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.10,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ముగ్గురు
దడువాయిలపై వేటు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు నష్టం జరిగేలా వ్యవహరించిన ముగ్గురు దడువాయిలను సస్పెండ్ చేస్తూ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం మార్కెట్‌తో పాటు కోల్డ్‌స్టోరేజీల్లో పంటలను కాంటా వేసే క్రమాన కమీషన్ వ్యాపారులు, ఖరీదుదారులతో కుమ్మకై ్కన కొందరు దడువాయిలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పత్తి, మిర్చి బస్తాకు 5 – 10 కిలోల మేర తూకం ఎక్కువగా వేస్తుండడంతో రైతులకు నష్టం జరుగుతోంది. ఈక్రమాన కొందరు దడువాయిలు, వ్యాపారులు కుమ్మకై ్క కొన్నాళ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో ముత్తబోయిన లక్ష్మీనారాయణ, చిన్నం నర్సయ్య, పిల్లలమర్రి బాబు 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


