‘అరైవ్‌–అలైవ్‌’ వాల్‌ పోస్టర్లు ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘అరైవ్‌–అలైవ్‌’ వాల్‌ పోస్టర్లు ఆవిష్కరణ

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజాపాలన ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 వరకు నిర్వహించే అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమం సోమవా రం ప్రారంభమైంది. ఈ సంరర్భంగా కలెక్టర్‌ అంకిత్‌ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడా రు. రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. మాన వ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్‌ ధరించడం, సీటుబెల్ట్‌ విని యోగం, అధిక వేగంతో వాహనాలు నడపకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకుండా ఉండడం వంటి భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధి కారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘సెన్సస్‌’ గడువులోగా పూర్తి చేయాలి

సెన్సస్‌కు సంబంధించిన పెండింగ్‌ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్‌–2027 ఏర్పాట్లపై డీసీఓ భారతి హోళీకేరి సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి హాజరైన కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాలో సెన్సస్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement