మహిళా బిల్లు పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లు పేరుతో మోసం

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

మణుగూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ద సంస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకుందని, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఎన్నికల కమిషన్‌(ఈసీ) పూర్తిగాకేంద్రానికి దాసోహం అయి నట్లు కనిపిస్తోందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆరోపించారు. మణుగూరులో సోమ వారం ఆమె పర్యటించగా, కాంగ్రెస్‌ నాయకుడు గురిజాల గోపి, తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ట్రాక్టర్‌ నడిపిన ఆమె అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ నేపథ్యా న హడావుడి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. గ్యాస్‌ధరల పెంపు, కొరతపై మహిళలు తిరగబడతారనే భయంతోనే ఈ కొత్త నాటకానికి తెర తీశారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించి వారి రాజకీయ జీవితాలను మార్చిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీకే దక్కుతుందని ఆమె తెలిపారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న దిగుబడి ఆశాజనకంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రతీ ఒక్క కార్యకర్త కృషిచేయాలని ఆమె పిలుపునిచా రు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి

Advertisement
 
Advertisement
Advertisement