ఎస్‌ఎస్‌సీసీజీఎల్‌ పరీక్షలో 2,530 ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీసీజీఎల్‌ పరీక్షలో 2,530 ర్యాంక్‌

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన భీముడి తేజశ్వినిరెడ్డి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌) పరీక్షలో ప్రతిభ కనబరిచి ఆల్‌ఇండియా స్థాయిలో 2,530వ ర్యాంక్‌ సాధించింది. దీంతో ఆమెకు కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా నియామకం లభించనుంది. భీముడి వెంకట్‌రెడ్డి, శైలజ కుమార్తె తేజస్వినిరెడ్డి చిన్ననాటి నుంచే లక్ష్యసాధనలో ముందుండి.. ప్రతి దశ లో ప్రతిభ కనబరిచింది. కాగా, తేజస్వినిని గ్రామస్తులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement