చుంచుపల్లి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెంలోని నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని సీఈఓ చైతన్య కృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీలో పి.చరణ్ 469 మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానాన నిలవగా ఉజ్వల్ అభినవ్ సాయి 468 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే, హారిక భరణి, పి.హర్షిణి, జెస్సింత రోజ్‌లు 467, ఎండీ ఆహాద్‌ఖాన్, ఎన్.నాగ సుజిత్, ఎస్‌కే సమీరా, గోలి భావన, వి.భావన, ఏ.లలిత ఆదిత్య 466 మార్కులు సాధించగా, ఈ విభాగంలో 30 మంది విద్యార్థులు 460 పైగా మార్కులు సాధించారని సీఈఓ పేర్కొన్నారు. అలాగే, జూనియర్ బైపీసీలో సాధనాల శ్రీలక్ష్మీమౌనిక 436 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని, కె.రేఖశ్రీ 435, ఏ.చరిష్మా, ఎండీ మహీన్‌తన్విన్ 434, జి.అభినవి, జి.రమేశ్, బండారి శ్రేష్ఠిత మూన్, పి.నవ్య తదితరులు 433 పైగా మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఎంఈసీలో జి.ఊర్మిళ 493 మార్కులతో అగ్రస్థానాన నిలవగా జి.సాయి మిథిల, ఆర్.అక్షయ్ 483, సీఈసీలో ఎస్.కౌశిక్ 489, ఎం.డీ.సనారజాక్ 488, పి.మంజు 483 మార్కులు సాధించారని చెప్పారు. ఇక ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తిమ్మిశెట్టి ప్రవళిక 994 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా, ఇస్లావత్ నాగరాజు 993, పి.పవన్‌శంకర్, జి.హన్సిక 990, బైపీసీలో డి.వినీల 990, టి.మైత్రి 986, బానోతు రూప, ఎం.సహస్ర 986, ఎంఈసీలో జి.రంగలహరి 976, సీఈసీలో భూక్య కుషిత 964 మార్కులు సాధించారని వెల్లడించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ వెంకటచౌదరి, సీఈఓ చైతన్యకృష్ణ, ప్రిన్సిపాల్ మల్లికార్జునరావు, రమేశ్, అధ్యాపకులు అభినందించారు.


