పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
దమ్మపేట: అనారోగానికి అప్పులు తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన అడపా నరసింహారా వు (38) సొంత భూమితో పాటు మరికొంత కౌలు కు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటల్లో సరైన దిగుబడి రాక అప్పుల పాలైన ఆయన పాంక్రియాటైటిస్ వ్యాధితో కొద్దికాలంగా బాధపడుతున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి కారులో అఖినేపల్లి శివారులోని కౌలు పొలానికి వెళ్లి కారులోనే పురుగుల మందు తాగా డు. సాయంత్రం అఖినేపల్లి వాసులు చూడగా నరసింహారావు మృతిచెందాడు. ఆయన భార్య కుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.
దాడిచేసినవారిపై కేసు
పాల్వంచరూరల్: గేదెలను ఫామ్‌కు తీసుకెళ్తున్న బిహార్‌కు చెందిన లారీడ్రైవర్‌పై దాడిచేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కోడిపుంజులవాగు శివారులోని గేదెల ఫామ్‌కు గేదెలను తీసుకొస్తున్న బిహార్‌కు చెందిన లారీడ్రైవర్ విక్రమ్‌కుమార్‌పై గతరాత్రి అదే గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడిచేసిన భూక్యా మధు, ధరావత్ పవన్, నూనవత్ నిరంజన్, ధరావత్ మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ.సురేశ్ తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్‌పై..
మండలంలోని నాగారం సమీపంలోని కిన్నెరసాని వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం నాగారం సర్పంచ్ స్వప్న భర్త అడ్డుకున్నాడు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఏసు దురుసుగా ప్రవర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.


