సూపర్‌బజార్(కొత్తగూడెం): జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నివాళులర్పించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని లైబ్రరీ హాలులో బార్ అసోసియేషన్ అధ్యక్షు లు కిరణ్‌కుమార్ పూలే చిత్రపటానికి పూలమాల వేశారు. అసోసియేషన్ సభ్యులు, న్యా యవాదులు పాల్గొన్నారు.
యువత మత్తు పదార్థాలకు బలికావొద్దు..
చుంచుపల్లి: యువత మత్తు పదార్థాలకు బలికావొద్దని డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్ పేర్కొన్నారు. ఆరోగ్య వారం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో శనివారం డ్రగ్ కంట్రోల్, రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డేను పురస్కరించుకొని కొత్తగూడెంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సాయికల్యాణ్, ప్రతాప్ పాల్గొన్నారు.
ఔషధ దుర్వినియోగంపై అవగాహన
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక.. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై శనివారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అలవాటుగా మారే ఔషధాలతో కలిగే దుష్ప్రభావాలు, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం, నకిలీ మందులకు సంబంధించి ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ (1800–599–6969) గురించి వివరించారు. అనంతరం కూలీలైన్‌లోని కెమిస్ట్, డ్రగ్గిస్ట్ భవన్‌లో సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్ హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం, అరికట్టడంలో విద్యార్థులు, ఆరోగ్య రంగ భాగస్వాముల పాత్ర ఎంత కీలకమో వివరించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థుల కోసం వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈగల్ ఇన్‌స్పెక్టర్ పి.విజయ్‌రామ్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అరవింద్‌కుమార్, తిరుపతిరెడ్డి, రవి, లక్ష్మణాచారి పాల్గొన్నారు.
108 వాహనంలో
గర్భిణి ప్రసవం
చింతకాని: ఏపీలోని గంపల గూడెం మండలం నెమలికొణిజర్ల గ్రామానికి చెందిన గర్భిణి రమాదేవి శనివారం 108 వాహనంలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబీకులు ప్రసవం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, అక్కడి వైద్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి సిఫారసు చేయగా 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమాన నాగులవంచ సమీపాన పురిటి నొప్పులు ఎక్కువవడంతో రమాదేవికి 108 సిబ్బంది గుజ్జర్లపూడి రామయ్య, పేరెల్లి రవీంద్రబాబు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


