జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రేమలత | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రేమలత

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా ప్రధాన న్యా యమూర్తిగా వరంగల్‌ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ప్రేమలత బదిలీపై రానున్నా రు. ఇప్పటివరకు జిల్లాప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పాటిల్‌ వసంత్‌ నల్లగొండకు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలతో దర్శనమిచ్చా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచా మృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.

20 నుంచి

‘ఓపెన్‌’ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: ఈ నెల 20వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణపై శుక్రవా రం అడిషనల్‌ కలెక్టర్‌వేణుగోపాల్‌ జిల్లా విద్యాధికారులతో తన చాంబర్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో పదోతరగతి పరీ క్షలు 1,045మంది రాయనుండగా, ఐదు కేంద్రాలు, ఇంటర్‌ పరీక్షలు 1196 మంది రాయనుండగా, ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటలవరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతాయని తెలిపారు. సెంటర్లలో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్స్‌, ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షల కు హాల్‌టికెట్‌, ఒరిజినల్‌ ఆధార్‌కార్డుతో హాజ రుకావాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి. నాగలక్ష్మి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శంభుప్రసాద్‌, వైద్య, పోలీసు, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌,ఇంటర్మీడియట్‌, ఆర్టీసీశాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు సమాచారం కోసం ఎస్‌.మాధవరావును 89192 79238 నంబరులో సంప్రదించాలని సూచించారు.

రామాలయానికి

బారికేడ్ల వితరణ

భద్రాచలంటౌన్‌: మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ (మహా సిమెంట్‌) యాజమాన్యం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి రూ. 4 లక్షల విలువైన 25 బారికేడ్లను శుక్రవారం బహూకరించింది. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు, ఏఈఓ శ్రవణ్‌ కుమార్‌లను సంస్థ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహా సిమెంట్‌ స్టేట్‌ హెడ్‌ కరుణాకర్‌ రావు, మార్కెటింగ్‌ మేనేజర్‌ సునీల్‌, రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, డీలర్‌ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement