పాల్వంచ/సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆర్టిజన్ కార్మికులు శుక్రవారం కుటుంబాలతో కలిసి ఆందో ళన చేపట్టారు. ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింప జేయాలని ఆర్టిజన్లు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరింది. కేటీపీఎస్ ఆస్పత్రి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా, కార్మికులు భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పాల్గొన్నా రు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ల కోరికలు న్యాయమైనవని, ప్రభుత్వం కార్మిక శ్రేయస్సును కాపాడాలని అన్నారు. సీపీఐజిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను రెండో శ్రేణి ఉద్యోగులుగా చూడటం బాధాకరమని అన్నా రు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు మాట్లాడుతూ ఆర్టిజన్లకు అండగా ఉంటా మని అన్నారు. కాగా, కొత్తగూడెం డివిజన్ కార్యాలయం ఎదుట కూడా ఆర్టిజన్ కార్మికులు ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అడుసుమల్లి సాయిబాబు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, బత్తుల మధుచంద్, సింధు తపస్వీ, గుగులోతు రాంబాబు, గుణచరిత్, పార్టీల నాయకులు ముతాల్య విశ్వనా థం, మల్లెల రవిచంద్ర, భట్టు మంజుల, ముత్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె


