సూపర్‌బజార్(కొత్తగూడెం): వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి రక్షణకు ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. కిట్‌లో టోపీ, కళ్లజోడు, వాటర్ బాటిల్, 30 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 60 మాస్క్‌లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. విధులపట్ల అలసత్వం వహించొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు


