పాల్వంచరూరల్: గిరిజన సహకార సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, సేల్స్‌మెన్లు తిరిగి విధులకు రాకూదని బ్రాంచి మేనేజర్ లక్ష్మణ్ ఆదేశించారు. ‘రిటైర్డ్ సేల్స్‌మెన్‌తో బియ్యం పంపిణీ’ శీర్షికన సాక్షి దినపత్రికలో బుధవారం కథ నం ప్రచురితమైంది. దీంతో జీసీసీ బ్రాంచ్ మేనేజర్ స్పందించారు. కిన్నెరసానిలో విధులు నిర్వహిస్తున్న జీసీసీ సేల్స్‌మెన్ లక్ష్మయ్య.. తనకు బదులుగా రిటైర్డ్ సేల్స్‌మెన్ వెంకట్రావ్‌తో విధులు నిర్వహింపజేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లగా సేల్స్‌మెన్ లక్ష్మ య్యకు మెమో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని మేనేజర్ తెలిపారు.


