రుద్రంపూర్: హైదరాబాద్‌లోని పోర్టియా హెల్త్‌కేర్‌లో కేర్ టేకర్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 10న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్‌మేళా ఉదయం 10 గంటలకు మొదలవుతుందని వెల్లడించారు. 18 – 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హతల పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
వలస కూలీల తిరుగుపయనం
చర్ల: మిర్చికోతలకు వచ్చిన సరిహద్దు ఛత్తీస్ గఢ్ వలస కూలీలు తిరుగుపయనమయ్యారు. బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల ఆదివాసీలు ఉపాధి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మిర్చి కోతలకు వలసవచ్చారు. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మిర్చి కోత పనులు చివరి దశకు చేరుకుంటుండటంతో తిరిగి వెళ్తున్నారు. దీంతో సరిహద్దు రహదారులు, గ్రామాలు సందడిగా మారాయి. కొన్ని నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. దీంతో చర్లలోని దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. గత ఆదివారం వారపు సంతలో బియ్యం, నూకలు ఇతర విక్రయాలు భారీగా సాగాయి. మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకుంటుండడంతో ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ గూడేల్లో సందడి నెలకొంటోంది.
నేడు ‘వనజీవి రామయ్య’ చిత్రబృందానికి సత్కారం
ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల గద్దర్ అవార్డు గెలుచుకున్న ‘వనజీవి రామయ్య’ చిత్రబృందా న్ని గురువారం ఖమ్మంలో సన్మానించనున్నారు. జిల్లా అటవీ శాఖ, వాస్విక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 10గంటలకు సన్మానం ఉంటుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేసి పద్మశ్రీ అవార్డు పొందిన వనజీవి రామ య్య జీవితచరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రానికి ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రదా నం చేసింది. ఈమేరకు చిత్రబృందానికి జరిగే సత్కారంలో అధికారులు, ప్రకృతి ప్రేమికులు, ప్రజలు పాల్గొనాలని డీఎఫ్‌ఓ కోరారు.
తల్లి మందలించిందని..
ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్య
పాల్వంచ: తల్లి మందలించడంతో ఉరివేసుకు ని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన కేటీపీఎస్ ఆర్టిజన్ భూక్యా కిషన్, సునీతల కుమారుడు మహేందర్‌నాయక్ (12) డీఏవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవా రం ఇంట్లో మహేందర్‌నాయక్ పెదనాన్న కుమారుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన మహేందర్‌నాయక్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. బాలుడి తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి అక్క కీర్తి తేజ ఉంది.
కంటి ఆపరేషన్లు చకచకా..
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ల నిర్వహణలో వేగం పెరగనుంది. ఈమేరకు శస్త్రచికిత్సకు అవసరమైన ఏ–స్కాన్, బీ–స్కాన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కంటి విభాగంలో ఈ యంత్రాలను ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ యంత్రాల ద్వారా అత్యంత కచ్చితత్వంతో కంటి పరీక్షలు, ఆపరేషన్లు సాధ్యమవుతాయని తెలిపారు. అంతేకాక ఎక్కువ ఆపరేషన్లు చేయడానికి వీలవుతుతుందని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓలు రాంబాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, జిల్లా అంధత్వ నివారణ అధికారి, ఆప్తాల్మిక్ హెచ్‌ఓడీ రామూనాయక్, ప్రొఫెసర్ జయంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆయేషాబేగం, ఎస్‌కే. ఆస్మా, సీనియర్ రెసిడెంట్లు రవీనా, పావని, నందగిరి శ్రీను పాల్గొన్నారు.


