అదుపుతప్పి బోల్తాపడిన స్కార్పియో | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి బోల్తాపడిన స్కార్పియో

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

దుమ్ముగూడెం: మండలంలోని కోయనర్సాపురం శివారులో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన స్కార్పియో వాహనం బోల్తాపడింది ఛత్తీస్‌గఢ్‌ నుంచి మారాయిగూడెం, చెరుపల్లి మీదుగా భద్రాచలం వెళ్తున్న స్కార్పియో కోయనర్సాపురం శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని నలుగురు డీఆర్జీ జవాన్లు క్షేమంగా బయటపడ్డారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు

దమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం వాసి కనిపించకుండాపోయిన ఘటనపై పోలీసులు బుధవా రం కేసు నమోదు చేశారు. మొద్దులగూడెం గ్రా మానికి చెందిన ఈదా నాగేంద్రబాబు(27) మొక్క జొన్న సీడ్‌ అర్గనైజర్‌గా అయుష్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 31న అతడు పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం నాగేంద్రబాబు భార్య రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

జూలూరుపాడు: జూలూరుపా డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత కారణంగా సబ్‌స్టేషన్‌లోని ఫీడర్‌ ట్రిప్‌ అవడంతోతీగల పైనుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. కింద ఉన్న చెత్తకు నిప్పురవ్వలు అంటుకోవడంతో మంటలు వ్యాప్తిచెందాయి. గమనించిన విద్యుత్‌ లైన్‌మెన్‌ భాస్కర్‌, సిబ్బంది అప్రమత్తమై విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. విద్యుత్‌ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నించినప్పటికీ ఫలి తం లేకపోవడంతో ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటల ను ఆర్పివేయడంతో ఎలాంటి నష్టం జరగలేదు.

ఇసుక నిల్వలు సీజ్‌

బూర్గంపాడు: మండలంలోని రెండు గ్రామాల్లో నిల్వచేసిన ఇసుకను పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. బూర్గంపాడులో 40 ట్రక్కులు, నాగినేనిప్రోలులో 43 ట్రక్కుల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్‌ చేశారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో వేలంపాట నిర్వహించి విక్రయించనున్నట్లు తహసీల్దార్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

గంజాయి తరలిస్తున్న

ఇద్దరు అరెస్ట్‌

సుజాతనగర్‌: గంజాయితో పట్టుబడిన ఇద్దరిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. చుంచుపల్లి సీఐ ఆర్‌.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎస్‌ఐ ఎం.రమాదేవి ఆధ్వర్యంలో స్థానిక ధన్వంతరీ కళాశాల సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తగూడెంకు చెందిన యాకూబ్‌పాషా, సుజాతనగర్‌ మండలంలోని డేగలమడుగు గ్రామానికి చెందిన కుదురుబోయిన నరసింహారావు నిషేధిత గంజాయితో పట్టుబడ్డారని, వారి వద్ద నుంచి రూ.7,580 విలువ గల 151 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు కొత్తగూడెం శేషగిరినగర్‌కు చెందిన కిరణ్‌ పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.

హెచ్‌ఎం సస్పెండ్‌

కామేపల్లి: కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం బి.నెహ్రూపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరించడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడమే కాక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement