సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా సర్కిల్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యాన ధర్నాతో పాటు వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులకు, పర్మిట్ కార్మికులకు వేర్వేరు రూల్స్ లేకుండా వారి విద్యార్హతను బట్టి పర్మనెంట్ జాబ్‌లు ఇవ్వాలన్నారు. అన్‌మాన్ వర్కర్లనూ ఆర్టిజన్లుగా గుర్తించాలని, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్, ఎస్‌పీఎం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామన్నారు. వివిధ సంఘాల నాయకులు కొలగాని రమేష్, భూక్య రమేష్, బొల్లి వెంకటరాజు, రాజేష్, హేమంత్, పులి గణేష్‌బాబు, శివరంజని, జిల్లా జేఏసీ చైర్మన్ కూనరాజు శ్రీనివాస్, నాయకులు రేఖ, గ్లోరీ పూర్ణిమ, కె.నీలవేణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


