చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

మణుగూరుటౌన్‌: కుటుంబ కలహాల నేపథ్యాన మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (37).. సోమవారం తన కుమారుడు కౌశిక్‌కు గడ్డిమందు తాగించి తాను కూడా తాగిన విషయం విదితమే. ఇద్దరినీ మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా కౌశిక్‌ పరిస్థితి కొంత కుదుటపడింది. ఆపై నాగేశ్వరరావును మెరుగైన చికిత్సనిమిత్తం మణుగూ రు నుంచి భద్రాచలం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు.

సింగరేణి ఐరన్‌ స్క్రాప్‌ స్వాధీనం

మణుగూరుటౌన్‌: సింగరేణి మణుగూరు ఏరియాలోని ఐరన్‌ స్క్రాప్‌ ను ఎత్తుకెళ్తున్న మహిళలను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఏరి యా సింగరేణి సెక్యూరి టీ అధికారి కె.శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. సుమారు 200 కేజీల ఐరన్‌ స్క్రాప్‌ను సోమవారం రాత్రి చోరీ చేసిన మహిళలు ఆటోలో తరలిస్తున్న క్రమాన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. దీంతో నిందితులను పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

పేకాట స్థావరంపై దాడి

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని దుబ్బతోగు శివారులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్‌ఐ టి.యయాతిరాజు ఆధ్వర్యాన మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.10,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భార్య తరఫు బంధువుల దాడి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పాల్వంచరూరల్‌: ఓ వ్యక్తిపై భార్య తరఫు బంధువులు దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాల్వంచ మండలం మొండికట్ట గ్రామానికి చెందిన గండికోట ప్రసాద్‌ (25) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉండగా ఇటీవల పిల్లలను భర్త వద్దే వదిలేసిన ఆమె హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉంటోంది. అయితే, పిల్లలు తల్లి కోసం బాధపడుతుండడంతో ప్రసాద్‌ ఆమె వద్దకు వెళ్లాడు. ఈక్రమాన భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య తరఫు బంధువులు ఆయనపై దాడి చేయడంతో బలమైన గాయాలయ్యాయి. ఈమేరకు కొత్తగూడెంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మృతదేహంతో మంగళవారం రాత్రి కిన్నెరసాని పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement