సూపర్‌బజార్(కొత్తగూడెం): రాబోయే రబీ సీజన్ ధాన్యంలో నూక శాతం ఎక్కువగా రానున్నందున మిల్లింగ్‌కు తీసుకోలేమని రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. మంగళవారం కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌కు వినతిపత్రాలు అందజేశాక వారు మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బియ్యం 50 శాతం మేర మిల్లుల్లోనే ఉండడంతో రబీ ధాన్యం దిగుమతికి ఖాళీ కూడా లేదని తెలిపారు. ఖరీఫ్ సీజన్ బియ్యానికి అలాట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. అలాగే, పదేళ్లుగా రైస్ మిల్లర్లకు బకాయి ఉన్న రవాణా, గోదాం తదితర చార్జీలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జుగల్ కిషోర్‌ఖండేల్‌వాల్, కొండూరు రాజేంద్రప్రసాద్, కోశాధికారి బచ్చు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


