జూలూరుపాడు: మండలంలోని సాయిరాంతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇంజన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. పంచాయ తీ ట్రాక్టర్‌ను రోజులాగే సోమవారం రాత్రి సమయంలో ఖాళీ స్థలంలో నిలిపారు. అర్ధరాత్రి సమయాన నిప్పు పెట్టగా మంటలు రావడంతో స్థానికులు సర్పంచ్‌కు ఫోన్ చేశారు. సర్పంచ్ బానోతు సుమలత, తదితరులు చేరుకునే సరికి బ్యాటరీ, వైరింగ్, టైర్లు కాలిపోయాయి. రెండేళ్లుగా మూలనపడిన ట్రాక్టర్‌కు ఇటీవల రూ.90 వేలు సొంత నగదుతో మరమ్మతు చేయించామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో సమీప గ్రామాల సర్పంచ్‌లు తాటి సువార్త, గడిగ సింధు, కొర్సా రమేశ్, బానోత్ కృష్ణ, లకావత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వాంకుడోత్ వెంకన్న, బోడా భీమారావు, బానోత్ రాంజీ, కిషన్ పాల్గొన్నారు.


