పెనుప్రమాదంగా సామ్రాజ్యవాద పోకడలు | - | Sakshi
Sakshi News home page

పెనుప్రమాదంగా సామ్రాజ్యవాద పోకడలు

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అమెరికా సామ్రాజ్య వాద పోకడలు యుద్ధానికి దారితీసి ప్రపంచశాంతికి పెనుప్రమాదంగా మారాయని.. యుద్ధంతో ప్రాణనష్టమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నానికి కారణమవుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండ లం లోతువాగులో మంగళవారం జరిగిన జిల్లా కౌ న్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం కారణంగా భారత్‌లోనూ ధరలు పెరగడమే కాక ఇతర సమస్యలు తలెత్తుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, అడవుల్లో సహజ వనరులను దోచు కునేందుకే కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులను తుదముట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాక సింగరేణి కార్మికుల హక్కులను కాలరాయడం మానుకోవా లని డిమాండ్‌ చేశారు. సేవ్‌సింగరేణి పేరుతో సోమవారం చేపట్టిన సింగరేణి ప్రధాన కార్యాల యం ముట్టడి విజయవంతం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తాచాటామని తెలిపారు. కార్మికులు, రైతు లు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన గళా న్ని అసెంబ్లీలో వినిపిస్తున్నారని సాబీర్‌పాషా వెల్లడించారు. సీపీఐ నాయకుడు జి.వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మిరియాల రంగయ్య, కొత్తగూడెం మేయ ర్‌ మూడ్‌ గణేశ్‌తో పాటు నాయకులు కె.సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, సలీం, సలిగంటి శ్రీనివాస్‌, చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, మువ్వా వెంకటేశ్వరరావు, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, అడుసుమిల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement