తొలిసారిగా | - | Sakshi
Sakshi News home page

తొలిసారిగా

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

తొలిసారిగా

మేజర్‌ గ్రామపంచాయతీ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. దీంతో తొలి పాలకవర్గం కొలువుదీరగానే.. మున్సిపాలిటీకి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అశ్వారావుపేట ప్రధానంగా ఉద్యాన పంటలు, పామాయిల్‌ తోటలు, పామాయిల్‌ పరిశ్రమలు ఆధారంగా ఎదిగిన పట్టణం. ఆకట్టుకునే పచ్చదనం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికంగా, పర్యాటకంగా పట్టణం అభివృద్ధి చెందేలా, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక 2005లో మున్సిపాలిటీగా మణుగూరు అప్‌గ్రేడ్‌ అయ్యింది. అయితే, రకారకాల కారణాలతో 19ఏళ్లుగా అధికారుల పాలనే సాగుతోంది. ఫలితంగా డ్రెయినేజీలు, మార్కెట్‌, పార్కులు వంటి కనీస సదుపాయాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉన్నందున ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావావాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement