నిరాశే మిగిల్చారు..! | - | Sakshi
Sakshi News home page

నిరాశే మిగిల్చారు..!

Mar 21 2026 5:09 AM | Updated on Mar 21 2026 5:09 AM

న్యూస్‌రీల్‌

మన్మోహన్‌సింగ్‌ వర్సిటీ,

సీతమ్మ సాగర్‌లపై చిన్నచూపు

పర్యాటక అవకాశం ఉన్నా

ఎకో టూరిజంలో దక్కని

ప్రాధాన్యం

గోదావరి పుష్కరాలు,

కొత్తగూడెం కార్పొరేషన్‌కు

నిధులతో ఊరట

ఆరు గ్యారంటీలను విస్మరించారు

హామీలు పట్టించుకోలేదు

ఈ సేవలకు వెలకట్టగలమా..!

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026

ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీకి రూ. 45 కోట్లు

భవిష్యత్‌ అవసరాలను అంచనా వేసుకుని రాబోయే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ను గతేడాది ప్రారంభించారు. గతంలో 320 ఎకరాల్లో విస్తరించిన ఇంజనీరింగ్‌ కాలేజీనే యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.45 కోట్లు కేటాయించారు. దీంతో అరకొర సౌకర్యాల మధ్య వర్సిటీ కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఉస్మానియాకు రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ.400 కోట్ల మేర కేటాయించిన ప్రభుత్వం మన్మోహన్‌సింగ్‌ వర్సిటీపై శీతకన్ను వేసింది.

ఎకో టూరిజంలో అన్యాయం

ఎకో టూరిజానికి (పర్యావరణ–పర్యాటకం) రూ.875 కోట్లు కేటాయించారు. కవ్వాల్‌ అభయారణ్యం (కుమురంభీం), మన్ననూర్‌ టైగర్‌ రిజర్వ్‌ (నాగర్‌ కర్నూల్‌)లకే పెద్ద పీట వేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు విస్తరించిన జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. జిల్లాలో భద్రాచలం పట్టణం పాపికొండలు, మారేడుమిల్లిలకు గేట్‌వేగా ఉంది. కిన్నెరసాని అభయారణ్యం (పాల్వంచ), కనకగిరి గుట్టలు (చండ్రుగొండ), రథం గుట్టలు (మణుగూరు) వంటి ప్రాంతాలు ఎకో టూరిజానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. అయితే వీటికి బడ్జెట్‌ కేటాయింపుల్లో సముచిత స్థానం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ఎయిర్‌పోర్టుల విషయంలో వరంగల్‌, ఆదిలాబాద్‌లను బడ్జెట్‌లో పేర్కొనగా, కొత్తగూడెం ఊసే లేకుండా పోయింది. భద్రాచలం టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఒక్కపైసా నిధులు రాలేదు.

ఊరట నిచ్చిన కేటాయింపులు

రాబోయే గోదావరి పుష్కరాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి తెలంగాణలో ప్రధాన ఘాట్‌గా భద్రాచలాన్నే పేర్కొనాలి. ఈ నేపథ్యంలో పుష్కరాల నిధుల్లో ఎక్కువ మొత్తం జిల్లాకే దక్కే అవకాశముంది. నగరాభివృద్ది పద్దులో భాగంగా కొత్తగా కార్పొరేషన్లుగా అప్‌గ్రేడైన నల్లగొండ, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, కొత్తగూడెంలకు రూ.754 కోట్లు కేటాయించారు. ఈ పద్దు నుంచి రమారమి రూ.200కోట్లు జిల్లాకేంద్రం అభివృద్ధికి వచ్చే అవకాశముంది. దీంతోపా టు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక సర్క్యూట్‌ పేరుతో తొమ్మిది ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇందులో నూ భద్రాచలానికి స్థానం దక్కే అవకాశముంది. ఇక ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమం కింద వందశాతం సబ్సిడీతో పోడు భూముల్లో బోర్లు వేయనున్నారు. ఇందులో జిల్లాకు సింహభాగం నిధులు దక్కనున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు అరకొరగా నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2026–27లో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురైంది. రాష్ట్రం మొత్తానికి వర్తించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను మినహాయిస్తే జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీ లేవు. మన్మోహన్‌ సింగ్‌ యూనివర్సిటీ ఊసే ఎత్తకపోగా సీతమ్మసాగర్‌కు పైసా విదల్చలేదు. అత్యధికంగా అటవీ విస్తీర్ణం, పర్యావరణ పర్యాటక అవకాశాలు ఉన్నా ఎకో టూరిజంలో ప్రాధాన్యం దక్కలేదు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు ఊరట కలిగించింది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలను విస్మరించారు. రైతు కూలీలకు రూ.12వేలు, రూ. 2500, రైతుభరోసా రూ.15వేల వంటి పథకాలకు కేటాయింపులు లేవు. బీసీలకు న్యాయం జరగలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించలేదు. విద్యా, వైద్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. మొత్తంగా ప్రభుత్వం పేదలను విస్మరించినట్లు తేటతెల్లమవుతోంది. –మచ్చా వెంకటేశ్వర్లు,

సీపీఎం జిల్లా కార్యదర్శి

బడ్జెట్‌లో మైనారిటీల కు అరకొరగా నిధులు కేటాయించారు. ఎన్ని కల ముందు మైనారిటీ డిక్లరేషన్‌లో మైనారిటీలకు ఉప ప్రణాళికతోపాటు మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ రూ.4వేలకోట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల రుణాలకు రూ.1000కోట్లు కేటాయిస్తామని, ఇమామ్‌, మౌజన్‌ వేతనం రూ.10వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపులో ఇవేమీ పట్టించుకోలేదు. –ఎండీ యాకూబ్‌ పాషా,

మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement