గుండాల: ఆళ్లపల్లి మండలం పాలగుంపునకు చెందిన గొగ్గెల సమ్మయ్య (53) కుటుంబ కలహాలతోపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకన్నాడు. ఎస్‌ఐ సోమేశ్వర్ వివరాలు సేకరించి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
‘హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం’
చుంచుపల్లి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలనే డిమాండ్‌తో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందడం లేదని, కాంగ్రెస్ నాయకులు చేతివాటం చూపిస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు ఏనుగు వెంకట్‌రెడ్డి, జంపా సీతారామరాజు, పోడియం బాలరాజు, పొన్నం భిక్షపతి, చెరుకు భాగ్యలక్ష్మి, పి.రవీంద్ర, బిజ్జుం శ్రీనివాస్‌రెడ్డి, వెంకన్న, జె.కృష్ణ రాపాక రమేష్, పోలోజు క్రాంతి, జబ్బురి రమేష్, మెట్ట వెంకటేశ్వర్లు, పల్లపు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, ఈసాల వెంకటేశ్వర్లు, పి.భిక్షపతి, సుధాకర్‌రెడ్డి, బి.శ్రీధర్ పాల్గొన్నారు.


