పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

Mar 21 2026 5:09 AM | Updated on Mar 21 2026 5:09 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం జరిపారు. కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు.

హుండీ ఆదాయం రూ. 42.84 లక్షలు

అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. ఎండోమెంట్‌ శాఖ కొత్తగూడెం డివిజన్‌ పరిశీలకుడు పి.బేల్‌సింగ్‌, ఈఓ ఎన్‌.రజనీకుమారి పర్యవేక్షణలో లెక్కించారు. 2025 అక్టోబర్‌ 9వ తేదీ నుంచి 2026 మార్చి 19వ తేదీ వరకు 162 రోజుల కానుకలను లెక్కించగా రూ.42,84,648 ఆదాయం లభించింది. 35 ఇంగ్లాండ్‌ పౌండ్స్‌, 10 యూరోలు, 50 కెనడా డాలర్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఽతాంజనియా 10,000 షిలాంగులు, 18 విదేశీ నాణేలు, మిశ్రమ వెండి, బంగారం కూడా కానుకలుగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం నాగేశ్వరరావు, రాంరెడ్డి, పాపా రావు, శ్రీనివాసరావు, సుధాకర్‌, సాయిబాబా, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

భద్రగిరి మార్ట్‌ పనులు వేగవంతం చేయాలి

భద్రాచలంటౌన్‌: ఈ నెలలో ప్రారంభంకానున్న భద్రగిరి మార్ట్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆదివారంలోపు సేకరించిన పప్పు దినుసులు, తృణధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను ప్యాకింగ్‌ చేసి ర్యాకుల్లో అమర్చాలని సూచించారు. అధికారులు డేవిడ్‌రాజ్‌, వేణు, ఉదయ్‌, హరికృష్ణ, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement