నేడు ఈదుల్‌ ఫితర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఈదుల్‌ ఫితర్‌

Mar 21 2026 5:09 AM | Updated on Mar 21 2026 5:09 AM

● నెలవంక దర్శనంతో ముగిసిన రంజాన్‌ ఉపవాసాలు ● ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గా, మసీదుల్లో ఏర్పాట్లు పూర్తి

● నెలవంక దర్శనంతో ముగిసిన రంజాన్‌ ఉపవాసాలు ● ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గా, మసీదుల్లో ఏర్పాట్లు పూర్తి

కొత్తగూడెంటౌన్‌ /కరకగూడెం/చండ్రుగొండ: ముస్లింలకు ఇష్టమైన రంజాన్‌ పండుగను శనివారం జరుపుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతో ముస్లింలు నెల రోజులుగా పాటిస్తున్న రోజా ఉపవాసాలు విరమించారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మసీద్‌, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్‌ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని రైటర్‌బస్తీ సమీపంలో ఉన్న బోడగుట్ట ఈద్గాలో, రామవరంలోని 2 ఇంక్లైన్‌ ఈద్గా, రుద్రంపూర్‌లోని ఈద్గాలతోపాటు కొత్తగూడెం త్రీటౌన్‌ సమీపంలోని మసీదులో, రామవరం, రుద్రంపూర్‌, కూలీలైన్‌, గౌతంపూర్‌, విద్యానగర్‌కాలనీ, పాత కొత్తగూడెం మసీదులతోపాటు పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోని మసీదులను వేడుకలకు సిద్ధం చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహించుకోనున్నారు. కొత్తగూడెంలోని రామవరం జామియా మసీదు నుంచి ఉదయం 8 గంటలకు 2 ఇంక్లైన్‌లోని ఈద్గాకు, బోడగుట్ట వద్ద ఉన్న ఈద్గాకు సామూహికంగా చేరుకోనున్నారు. ఈద్గా వద్ద ఉదయం 9 గంటల నుంచి మత పెద్దలు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయించనున్నారు.

ఎస్పీ రంజాన్‌ శుభాకాంక్షలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ముస్లింలకు ఎస్పీ రోహిత్‌రాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో రంజా న్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement