ఇసుక సొసైటీ సమస్యను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక సొసైటీ సమస్యను పరిష్కరించాలి

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

ఇసుక సొసైటీ సమస్యను పరిష్కరించాలి

ఇసుక సొసైటీ సమస్యను పరిష్కరించాలి

కొత్తగూడెంఅర్బన్‌: చర్ల మండలం చీమలపాడు, కొయ్యూరు గిరిజన ఇసుక సొసైటీలను వేర్వేరుగా నడుపుకునేలా చర్యలు తీసుకోవాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కోరారు. సోమవారం టీఎస్‌ఎంటీసీ అధికారులను కలిసి వినతిని అందజేసి మాట్లాడారు. తప్పుడు పద్ధతుల్లో ఒకటే సొసైటీగా సభ్యత్వాన్ని చేర్పించి, స్థానిక రాజకీయ ఆధిపత్యంతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కరించి ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు ముద్దా బిక్షం, కె.రంగారెడ్డి, జాటోత్‌ కృష్ణ, సాయన్న, శివప్రశాంత్‌, పాలెం చుక్కయ్య, నాగరాజు, చీమలపాడు సొసైటీ అధ్యక్షురాలు ఇర్ఫా సామ్రాజ్యం, బెల్లంకొండ ధన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement