అసిస్టెంట్‌ చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

అసిస్

అసిస్టెంట్‌ చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష

రుద్రంపూర్‌: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఖాళీగా అసిస్టెంట్‌ చైన్‌మన్‌ ఇంటర్నల్‌ పోస్టులకు సోమవారం ఎంవీటీసీలో ప్రాక్టికల్‌ పరీక్ష నిర్వహించారు. 4 పోస్టులకు 9 మంది హాజరయ్యారు. 10 మంది సర్వే మజ్దూర్‌ పోస్టులకు కూడా రాత పరీక్ష నిర్వహించగా, 82 మంది హాజరయ్యారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినట్లు ఇన్‌చార్జి ఎస్‌వోటూ జీఎం డి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మోహన్‌రావు, జి. లక్ష్మణ్‌, సర్వే ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, కలవల చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సహఉద్యోగి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం

ఇల్లెందురూరల్‌: ఇటీవల మృతి చెందిన పీఏసీఎస్‌ ఉద్యోగి సదానందం కుటుంబానికి సహఉద్యోగులు సోమవారం ఆర్థికసాయం చేశారు. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో సదానందం చిత్రపటానికి పీఏసీఎస్‌ సీఈఓ హీరాలాల్‌, ఖమ్మం జిల్లా ఉద్యోగులు అంజయ్య, పరమేశ్వరరావు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగుల తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని సదానం భార్య పేరిట ఫిక్స్‌డ్‌ చేసి పత్రాలు అందజేశారు.

ఒక్కటైన వలస కూలీల జంట

నేలకొండపల్లి: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ యువతీ, యువకుడు ప్రేమించుకోగా స్థానిక రైతులు వారి పెద్దలను ఒప్పించి వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు పలువురు నేలకొండపల్లి మండలంలోని మోటాపురంలో ఏటా నాలుగు నెలల పాటు మిర్చి ఏరేందుకు వస్తారు. ఇందులో పూల్‌సింగ్‌, ఆశ ఉండగా వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో మోటాపురానికి చెందిన రైతు సోదరులు భూక్యా మోహాన్‌రావు, భూక్యా లక్ష్మణ్‌ వారి తల్లిండ్రులతో ఫోన్‌లో మాట్లాడి ఒప్పించారు. అంతేకాక పెళ్లి ఖర్చులు, భోజనం ఇతరత్రా అన్నీ భరించి సోమవారం వీరన్నస్వామి ఆలయంలో కల్యాణం జరిపించారు. సీపీఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు భాగం నరసింహారావు, మూడు శ్రీనుతో పాటు రైతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

అసిస్టెంట్‌  చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష1
1/2

అసిస్టెంట్‌ చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష

అసిస్టెంట్‌  చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష2
2/2

అసిస్టెంట్‌ చైన్‌మన్‌ పోస్టులకు పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement