రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి
18 ఏళ్లు నిండితే
ఓటరుగా నమోదు కావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహింఛారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మసీదులు, పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రెండు పూట లా తాగునీరు సరఫరా చేయాలని, ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అంబులెన్సులు అందుబాటులో ఉండాలని, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పాలు, తదితర నిత్యావసర వస్తువులు సరిపడా అందుబాటులో ఉండేలా డెయి రీ అభివృద్ధిశాఖ అధికారులు చూడాలన్నారు. తొలుత ముస్లిం మతపెద్దలు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖాధికారి సంజీవరావు, కార్మిక శాఖా ధికారి షర్ఫుద్దీన్, పోలీస్, మిషన్ భగీరథ అధికారులు, కొత్తగూడెం పాల్వంచ ఇల్లెందు మణుగూరు ము న్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమ ని, 18సంవత్సరాలు నిండిన ప్రతీఒక్కరు ఓట రు గా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం 16వ జాతీయ ఓటర్ల దినో త్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని చెప్పా రు. ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో విధిగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఓటుహక్కు ద్వారా అర్హత కలిగిన ప్రజాప్రతి నిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనీనా, బీసీసంక్షేమ శాఖాధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, ఎన్నికల సూపరింటెండెంట్ రంగప్రసాద్, అన్నిశాఖల జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది నవీన్, ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


