దావోస్‌లో పాల్వంచ వాసి
పాల్వంచ: పాల్వంచకు చెందిన విలీన్ బయో మెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యడమకంటి మధుసూదన్‌రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో దాదాపు రూ.2,200 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాల్లో కీలకభూమిక వహించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన కంపెనీ మహారాష్ట్రలోని నాసిక్‌లో రూ.2,100 కోట్లతో ఫార్మా హబ్ నిర్మించనుండగా, ఈ ప్రాజెక్ట్‌లో విలీన్ బయోమెడ్ లిమిటెడ్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించనుంది. కేరళలో రూ.100 కోట్ల మెడికల్ హబ్ ఏర్పాటుకు సైతం ఒప్పందం చేసుకున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీలో ప్రస్తావిస్తా..
ఎమ్మెల్యే జారే
దమ్మపేట: గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మి కుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరి ష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినా రాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధి లోని మందలపల్లి గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ఆయన చెత్తా చెదారం ఊడ్చారు. వారితో ముచ్చటించి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు ప్రశంసనీయమని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో సరస్వతి పూజలు
పాల్వంచరూరల్: వసంత పంచమిని పురస్కరించుకుని శుక్రవారం పెద్దమ్మతల్లి ఆలయంలో అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. సరస్వతి పూజలు జరిపి, చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. 50 మంది చిన్నారులకు పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు వితరణ చేశారు. ఈఓ రజనీకుమారి, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ల సేవలు అభినందనీయం
ఎస్పీ రోహిత్ రాజు
చుంచుపల్లి: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ డ్రైవర్ల సేవలు అభినందనీయమని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తతతో ఇటీవల జిల్లాలో ఆర్టీసీలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఆర్టీసీకి అండగా పోలీస్‌శాఖ ఉంటుందని, సిబ్బంది కేసుల విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణాను గమనిస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డీటీఓ భూషిత్ రెడ్డి, ఎంవీఐ వెంకటరమణ, ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, కొత్తగూడెం డీఎం రాజ్యలక్ష్మి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
దావోస్‌లో పాల్వంచ వాసి
దావోస్‌లో పాల్వంచ వాసి
దావోస్‌లో పాల్వంచ వాసి


