గుండెపోటు వస్తే సీపీఆర్ చేయాలి
పాల్వంచ: గుండెపోటు వస్తే తక్షణమే సీపీఆర్ చేయాలని జిల్లా వైద్యాధికారి తుకారం రాథోడ్ అన్నారు. శనివారం కేటీపీఎస్ కర్మాగారంలో ఎస్‌పీఎఫ్ ఆధ్వర్యంలో సీపీఆర్ విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సీపీఆర్‌తో ఆపద సమయాల్లో ప్రాణాలను రక్షించే వీలు ఉంటుందన్నారు. అంతకుముందు పట్టణంలో నిర్వహిస్తున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను పర్యవేక్షించారు. అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ కిరణ్, వైద్యులు బానోతు ప్రసాద్, మధు వరుణ్, డీపీఎం మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం: మండల కేంద్రంలోని కాలువ బజార్ ఎస్సీ కాలనీకి చెందిన దళిత మహిళపై మొండికుంట గ్రామానికి చెందిన వ్యక్తి ఈ నెల 16న తెల్లవారుజామున అత్యాచారానికి యత్నించాడు. శనివారం బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మొండికుంటకు చెందిన నెహ్రుపై అత్యాచారయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.


