కోడ్ ముగిసిన వెంటనే సమస్యల పరిష్కారం
భద్రాచలంటౌన్: గిరిజన దర్బార్‌లో ఆదివాసీలు పలు సమస్యలపై వినతులు సమర్పించారని, ఎన్నికల కోడ్ ముగియగానే వాటిని పరిష్కరిస్తామని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మంది గిరిజనులు పోడు భూముల పట్టాలు, ఆన్‌లైన్, గిరి వికాసం పథకం ద్వారా సబ్సిడీపై కరెంటు, బోరు, మోటార్లకు సంబంధించి వినతులు ఇచ్చారని వివరించారు. కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, కొండరెడ్ల విభాగం అధికారి గన్యా, మేనేజర్ ఆదినారాయణ, రామ్ నరేష్, భార్గవి పాల్గొన్నారు.
ఏపీఓ డేవిడ్ రాజు


