నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి
బూర్గంపాడు: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు. బూర్గంపాడు మండలంలో నామినేషన్ల ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల సెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాకే స్వీకరించాలని, ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య ఉన్నారు.
ఐటీడీఏలో పరిశీలన..
భద్రాచలంటౌన్ : ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్ రెడ్డి గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించాక మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. తొలుత ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ అశోక్ ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ప్రభాకర్, చంద్రమోహన్, ఆదినారాయణ, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి, రాందాస్, పోశాలు, భాస్కర్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన అబ్జర్వర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సర్వేశ్వర్‌రెడ్డి, లావణ్య కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి కలెక్టర్ పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి


