నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
‘శ్రీరామ్’ ఇటుకలను తయారు చేసిన ఈఓ..
దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులచే తయారు చేయించి విక్రయానికి పెట్టిన ‘జై శ్రీరామ్’ ఇటుకలను ఈఓ దామోదర్‌రావు గురువారం పరిశీ లించారు. తయారీవిధానాన్ని అడిగి తెలుసుకు ని తాను స్వయంగా ఇటుకలు తయారు చేశారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, మంత్రపుష్పం, హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేద పండితులు, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కవితల పోటీలో ప్రథమ స్థానం
భద్రాచలంటౌన్: భద్రాచలానికి ప్రముఖ న్యాయవాది, కవి పామరాజు తిరుమలరావు రచించిన ‘మాతృభాష వేదన’ కవిత అంతర్రాష్ట్ర పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచలో మరాఠీ – తెలుగు ద్విభాషా సేవా సమితి నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 310 మంది కవులు పాల్గొనగా, తిరుమలరావు కవితకు అగ్రస్థానం దక్కింది. ఈమేరకు నిర్వాహకులు మనోహర్ సలాస్కర్ గురవారం సమాచారం అందించారు. ఈ సందర్భంగా తిరుమలరావును పలువురు అభినందించారు.
నేడు జిల్లా స్థాయి
చెకుముకి సంబురాలు
కొత్తగూడెంఅర్బన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సంబురాలు శుక్రవా రం కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, చంద్రమౌ ళి తెలిపారు. గురువారం కొత్తగూడెంలో వారు మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రథమ స్థా నం పొందిన విద్యార్థులు సంబురాలకు హాజరవుతారని, వారిని నాలుగు కేటగిరీలుగా విభజిస్తామని తెలిపారు. వేడుకలకు వచ్చే విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే గుర్తింపు పత్రం, పెన్నులు, ఆధార్ కార్డు తీసుకురావాలని, తల్లిదండ్రులు లేదా సైన్స్ టీచర్లను తోడుగా తీసుకుని రావాలని సూచించారు. శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్, 11 నుంచి 12 గంటల వరకు రాత పరీక్ష, 12 30 నుంచి 1.30 వరకు క్విజ్ పోటీలు ఉంటాయని వివరించారు. 1.30 నుంచి 2.30 వరకు భోజన విరామం ఉంటుందని, తామే భోజన వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వెల్లడించారు. డీఈఓ బి.నాగలక్ష్మితో పాటు పలువురు అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో జేవీవీ నాయకులు కస్తూరి, వీరభద్రం, మోహన్‌రావు, తిరుపాలు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


