జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
టేకులపల్లి:మండలంలోని బద్దు తండాలో ఉన్న ఏకలవ్య (ఈఎంఆర్‌ఎస్) విద్యార్థులు జాతీయస్థాయి పోటీల్లో రాణించారు. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపాల్ నిశాంత్‌కృష్ణ, పీఈటీ మహేశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 15 వరకు ఒడివా రాష్ట్రంలో 5వ జాతీయస్థాయి ఈఎంఆర్‌ఎస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో టేకులపల్లి విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఈఎంఆర్‌ఎస్ జట్లలో ప్రాతినిధ్యం వహించారు. ఇందులో వాలీబాల్లో ప్రథమ బహుమతి సాధించడంతో పాటు జూడోలో వి.రఘు, జి.చరణ్, టైక్వాండో విభాగంలో కె.సాయిచరణ్, స్విమ్మింగ్‌లో పి.కిరణ్‌నాయక్, గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థులను ఏకలవ్య ప్రిన్సిపాల్, పీఈటీతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.


