భవిష్యత్ తరాల కోసం పాటుపడాలి
పాల్వంచరూరల్: ఆదివాసీలు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పాటుపడాలని ఆదివాసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆధార్ సొసైటీ నాయకులు పొడియం బాలరాజు, జేజే రాంబాబు అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న కొమరంభీమ్ భవనంలో శనివారం నిర్వహించిన సంఘం జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఈనెల 23న ఉట్నూర్‌లో జరిగే ధర్మయుద్ధం–2 మహాసభను విజయవంతం చేయాలని కోరారు. తొలుత కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో నాయకులు మెట్ల పాపయ్య, పోలేబోయిన వెంకటేశ్వర్లు, సోయం సత్యనారాయణ, వీసాల కృష్ణయ్య, లక్ష్మణ్, కల్తీ నర్సింహారావు, వీసాల ఉమాదేవి, భవాని, దుర్గ, సుధారాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.


