‘సిద్ధి’ వరి రకం క్షేత్ర ప్రదర్శన
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో శనివారం ‘సిద్ధి’(వరంగల్ 44) వరిరకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్రవ్యవ సాయ శాఖ ద్వారా విడుదల చేసిన ఈ విత్తనాలతో గ్రామానికి చెందిన ఐలూరి కోటిరెడ్డి పంట సాగు చేశారు. ఈ సందర్భంగా రైతులతో క్షేత్రాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు మాట్లాడా రు. ఈ విత్తనం చౌడు, ఉల్లికోడును తట్టుకుంటుందని, వానాకాలం సాగుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్, వైరా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ వి.చైతన్య, డాక్టర్ టి.పావని, రైతులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు
భారంగా ఐటీ స్లాబ్‌లు
మధిర: కేంద్రం నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిదో వేతన సంఘంలోని నిబంధనలు ఉద్యోగులకు భారంగా మారాయని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ పేర్కొన్నారు. మధిర టీవీఎం పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడా రు. కేంద్రం రెండేళ్లు ఆలస్యంగా ఏర్పాటు చేసిన వేతన సంఘంలో పీఆర్సీ, డీఏ పెంపుదల ప్రస్తావించకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు అన్యా యం జరుగుతోందని తెలిపారు. కాగా, రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్ల చెల్లింపులో రాష్ట్రప్రభుత్వం అలసత్వాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. అంతేకాక జిల్లా ఉన్నతాధికారులు రేషనలైజేషన్, వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరిట తరచూ సమీక్షలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయొ ద్దని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్‌వలీ, మండల అధ్యక్షుడు బండారు నాగరాజుతో పాటు అనుమోలు కోటేశ్వరరావు, గుగులోత్ రామకృష్ణ, వినోద్‌రావు, ఆర్.లక్ష్మణ్‌రావు, మీరా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు క్లాసికల్ డ్యాన్స్ పోటీలు
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ ఎ కాలనీ సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం తెలుగు రాష్ట్రాల స్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ జిల్లాల నుంచి భరతనాట్యం, కూచిపూడి, జానపద, శాసీ్త్రయ నృత్య పోటీలకు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘మత్తు’తో జీవితాలు నాశనం చేసుకోవద్దు
కొత్తగూడెంఅర్బన్: గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సూచించారు. ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు చేపడుతున్న చైతన్యం – డ్రగ్స్‌పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కళాజాతా నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ.. గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి కొందరు అమూల్యమైన భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను కనిపెడుతూ వారు చెడు మార్గంలో నడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ రవాణా, వినయోగంపై ఎవరికై నా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కొత్తగూడెం టూటౌన్ సీఐ ప్రతాప్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం త్రీటౌన్ సీఐ శివప్రసాద్, వన్‌టౌన్ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.
‘సిద్ధి’ వరి రకం క్షేత్ర ప్రదర్శన
‘సిద్ధి’ వరి రకం క్షేత్ర ప్రదర్శన


