ఆపన్నహస్తం అందించరూ..
భద్రాచలంటౌన్: వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆర్థికసాయం చేయాలని దాతలను వేడుకుంటున్నారు. భద్రాచలం పట్టణంలోని భూపతిరావు కాలనీకి చెందిన వేల్పుల దాసు–సుజాత దంపతుల కుమారుడు చక్రవర్తి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పడుతున్నాడు. వైద్యులు పరీక్షించి ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, ఇందుకోసం సుమారు రూ. 15 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రస్తుతం యువకుడు ఖమ్మంలో చికిత్స పొందుతున్నాడు. చక్రవర్తి తండ్రి పెయింటర్‌గా, తల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారుడికి వైద్యం అందించే ఆర్థిక స్థోమత లేక ఆవేదన చెందుతున్నారు. దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. ఆర్థికసాయం చేసేవారు 63019 68509 నంబర్‌లో సంప్రదించాలని వేడుకుంటున్నారు. కాగా బ్యూటిఫుల్ లైఫ్ ఫౌండేషన్ (బీఎల్‌ఎఫ్) రూ. 2 వేల ఆర్థికసాయం చేసింది.
బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు..
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన సొబ్బని సూర్యం కుమారుడు వెంకన్న బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వెంకన్నకు ఆపరేషన్ చేశారు. మరోసారి కూడా ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండోసారి ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోవడంతో యువకుడి కుటుంబం మనోవేదన చెందుతోంది. ఆస్తులు విక్రయించి రూ. లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించానని, మళ్లీ రూ. లక్షల్లో ఖర్చు చేసే స్థోమత లేదని, దాతలు ఆదుకోవాలని యువకుడి తండ్రి సూర్యం కోరుతున్నాడు. ఆర్థిక సాయం అందించేవారు 94905 17657 నంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద యువకుడు
ఆపన్నహస్తం అందించరూ..
ఆపన్నహస్తం అందించరూ..


