మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Nov 9 2025 7:27 AM | Updated on Nov 9 2025 7:27 AM

మహిళ ఆత్మహత్యాయత్నం

మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీసులే కారణమని ఆరోపించిన బాధితురాలు

భద్రాచలంఅర్బన్‌: తన చావుకు పోలీసులే కారణమంటూ భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ కలహాలతో శుక్రవారం రాత్రి భద్రాచలం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్‌ చేశారని, డబ్బులు లేవన్నందుకు నోటికొచ్చినట్లు బూతులు తిట్టారని సదరు మహిళ ఆరోపించింది. పోలీస్‌ స్టేషన్‌ నుంచి నేరుగా గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకుని గోదావరిలోకి దూకుతుండగా మహిళను స్థానికులతో కలిసి పోలీసులు కాపాడారు. అర్ధరాత్రి బ్రిడ్జి బైఠాయించి పోలీసులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. స్థానికులు నచ్చజెప్పి ఆమెను పోలీస్‌ స్టేషనుకు తరలించారు.

వ్యక్తి ఆత్మహత్య

భద్రాచలం అర్బన్‌: పట్టణంలోని భగవాన్‌దాస్‌ కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు, కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చెందాడని తెలిపారు. మృతుడి కుటుంబీకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముగ్గురిపై కేసు నమోదు

పాల్వంచరూరల్‌: దాడి ఘటనలో ముగ్గురిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన మగ్త్యా, రమేష్‌లపై ఈ నెల 4వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన శంకర్‌, పద్మ, మోహన్‌లు కలిసి గొడవ పడి రాళ్లతో దాడి చేసి దూషించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి కారణమైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

వేధింపుల కేసు..

ఇల్లెందురూరల్‌: పోలీసులు శనివారం వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పాలేరుకు చెందిన బత్తుల రాంబాబు, రమాదేవి దంపతులు జీవనోపాధి కోసం మండలంలోని బాలాజీనగర్‌ వచ్చి నివాసం ఉంటున్నారు. పాలేరులో ఉన్న పొలం అమ్మి సొమ్ము తనకు ఇవ్వాలని రాంబాబు తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దాడి ఘటనలో..

ఇల్లెందురూరల్‌: దాడి ఘటనలో ఎనిమిది మందిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 6న ఎమత రామస్వామి, సుశీల దంపతులతో సహా ఎనిమిది మంది మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీకి చెందిన వేమూరి రామస్వామి ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టారు. కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రెండు లారీల ఇసుక సీజ్‌

ములకలపల్లి: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రాశులను రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. మండల పరిధిలోని సీతారాంపురం శివారులో ఇసుక నిల్వ చేసినట్లు శుక్రవారం రాత్రి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి రెండు లారీల ఇసుకను స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించనట్లు తహసీల్దార్‌ భగవాన్‌ రెడ్డి తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

ములకలపల్లి, (అన్నపురెడ్డిపల్లి): పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మండల పరిధిలోని అబ్బుగూడెం శివారు అటవీప్రాంతంలో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ 2,500 నగదు, నాలుగు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ సింహారెడ్డి తెలిపారు.

ఆయిల్‌పామ్‌ చెట్లు ధ్వంసం

విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్వాకం

చండ్రుగొండ : కరెంట్‌ లైన్‌కు అడ్డు వస్తున్నాయనే నెపంతో ఆయిల్‌పామ్‌ చెట్లను విద్యుత్‌శాఖ సిబ్బంది ధ్వంసం చేయడంతో బాధితరైతు లబోదిబోమంటున్నాడు. మండలంలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన అంచ సత్యనారాయణ ఆయిల్‌పామ్‌ తోట మీదుగా చండ్రుగొండ నుంచి పెనగడప గ్రామానికి వెళ్లే విద్యుత్‌ లైన్‌ ఉంది. విద్యుత్‌ తీగలకు తగులుతున్నాయనే నెపంతో మండలను చుంచుపల్లి మండలానికి చెందిన విద్యుత్‌ సిబ్బంది శుక్రవారం నరికేశారు. శనివారం తోట వద్దకు వెళ్లిన రైతు గమనించి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా చెట్లను నరికివేశారని, చెట్లకు ఉన్న గెల లు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాడు. వి ద్యుత్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement