ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
దేశం తరఫున ఆడాలి
ఎంతో సంతోషకరం
మెరుగైన భవిష్యత్..
పరిసర గ్రామాల నుంచి తరలివస్తున్న వీక్షకులు విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపుతున్న టోర్నీ
కరకగూడెం/పినపాక: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఏజెన్సీలో ఉత్సాహం నింపుతున్నాయి. పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జెడ్పీఎస్‌ఎస్‌లో శనివారం నుంచి రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఈ పోటీల్లో బాలబాలికల విభాగాల్లో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. పోటీల వీక్షణకు పరిసర గ్రామాల ప్రజలు కూడా వస్తున్నారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ నిర్వహణతో స్థానిక విద్యార్థులు, యువతలో క్రీడలపై ఆసక్తి పెరగనుంది. పోటీల కోసం పాఠశాలలో మెరుగుపరిచిన క్రీడా సౌకర్యాలు భవిష్యత్‌లో స్థానిక క్రీడాకారులకు అందుబాటులో ఉండనున్నాయి. తద్వారా క్రీడాకారులు ప్రతిభకు పదునుపెట్టే అవకాశం లభించనుంది.
కబడ్డీ కేవలం శక్తికి సంబంధించిన ఆట కాదు. ప్రతి రైడ్‌లోనూ వ్యూహాత్మక వ్యవహరించాల్సి ఉంటుంది. పోటీల్లో ప్రతిభ చాటి దేశం తరఫున ఆడి, మా తల్లిదండ్రుల కల నెరవేర్చడమే నా ఆశయం.
– దేవరాజ్, వరంగల్ జట్టు క్రీడాకారుడు
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. జాతీయ స్థాయిలో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నా. రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడాకారులను కలవడం ఉత్సాహం నింపుతోంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి.
– స్నేహ, ఖమ్మం జట్టు క్రీడాకారిణి
మట్టి కోర్టుల్లో ఆడే గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది. పోటీలకు వచ్చిన జట్లన్నీ కప్‌గెలవాలనే ఉత్సుకత చూపిస్తున్నాయి. క్రీడా ప్రతిభతో విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ ఉంటుంది.
– ఈసం నరసమ్మ, ఖమ్మం జట్టు కోచ్
జోష్ నింపుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..


