రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Oct 18 2025 7:17 AM | Updated on Oct 18 2025 7:17 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

బూర్గంపాడు: కృష్ణసాగర్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. గురువారం ప్రిన్సిపాల్‌ మెండెం దేవదాస్‌, అధ్యాపకులు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అండర్‌–19 రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు శ్యాంప్రసాద్‌, ఎం.జనార్దన్‌, నవదీప్‌, హాకీలో కృష్ణప్రసాద్‌, తులసీరామ్‌, భరత్‌, పార్థివే, రామ్‌చరణ్‌.. టేబుల్‌ టెన్నిస్‌కు శేషంత్‌ ఎంపికై నట్లు అధ్యాపకులు తెలిపారు.

విజ్ఞాన ప్రదర్శనలో

విద్యార్థుల ప్రతిభ

అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఇటీవల నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో మండలంలోని ఎర్రగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. రాష్ట్రపతి నిలయం ప్రతినిధుల నుంచి పురస్కారం అందుకున్నారు. మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద్‌కుమార్‌తోపాటు ఉపాధ్యాయులను అభినందించారు.

బెల్టు దుకాణాలపై దాడి

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం పట్టణంలో ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సతీశ్‌, రామకృష్ణ, ట్రాఫిక్‌ ఎస్‌ఐ తిరుపతి బెల్ట్‌ దుకాణాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పట్టణంలోని అన్ని బెల్ట్‌, పాన్‌ దుకాణాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, ఏజెన్సీ ప్రాంతం కావడంతో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు పెరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆపరేషన్‌ ‘చైతన్య’ పేరుతో ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి హాట్‌స్పాట్‌లలో నిత్యం తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు.

8 మందికి ఏడేళ్ల జైలు

అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన గూడూరు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఎనిమిది మందికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం కొత్తగూడెం ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కె.కిరణ్‌కుమార్‌ తీర్చు ఇచ్చారు. మృతుడి కుమారుడు శ్రీనివాసరెడ్డి మొండికుంటలో వారసత్వ భూమి రెండు ఎకరాలను తన తండ్రి మల్లారెడ్డిని బెదిరించి గ్రామానికి చెందిన మేడవరపు మంగపతిరావు, సుధీర్‌, సురేశ్‌, పర్వత నరేశ్‌, తుక్కాని రామిరెడ్డి, కాసరబాద సత్యం, రాములు, సందీప్‌, గూడురు జనార్దన్‌ రెడ్డి ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు. కాగా, ఎవరూ పట్టించుకోలేదని 2021 మార్చి 3న తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 12 మంది సాక్షులను విచారించారు. కేసు విచారణలో ఉండగా కాసరబాద సత్యం మృతి చెందాడు. విచారణ అనంతరం ఎనిమిది మందిపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్చు ఇచ్చారు. అదనపు పీపీ కారం రాజారావు వాదించగా.. కోర్టు నోడల్‌ ఆఫీసర్‌ ఎస్‌ఐ డి.రాఘవయ్య, లైజన్‌ ఆఫీసర్‌ ఎం.శ్రీనివాస్‌,పీసీ.ఈశ్వరరావు సహకరించారు.

అర్హులైన వారికే

అధ్యక్ష పదవి

భద్రాచలంటౌన్‌: పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ.. కష్టకాలంలోనూ పార్టీలో ఉన్న వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి, పదవి ఇస్తామని జిల్లా ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్‌ అబ్రహం తెలిపారు. భద్రాచలంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా అధ్యక్ష పదవికి అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణంతోపాటు బలోపేతం కోసం శ్రీసంఘటన్‌ సృజన్‌ అభియాన్‌శ్రీకార్యక్రమాన్ని ప్రారంభించిందని, జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను బలపరచడం, బాధ్యతాయుతమైన, ప్రజలకు చేరువైన పార్టీ నిర్మాణాన్ని సృష్టించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, జిల్లా, డివిజన్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక1
1/2

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక2
2/2

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement